చింత లేదిక యేసు పుట్టెను

Chintha ledika Yesu puttenu

N D Abel 28 Oct 2025

చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా || 2 || దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి ||చింత లేదిక|| చుక్క గనుగొని జ్ఞానులేంతో మక్కువతో నా ప్రభుని కనుగొన చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి ||చింత లేదిక|| కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై ||చింత లేదిక|| పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము ||చింత లేదిక||


chinta ledika yesu puttenu vintaganu betlehamanduna chenta jeranu randi sarva janangama santasamonduma || 2 || duta telpenu gollalaku subhavarta na divasambu vintaga khyati miraga varu yesunu ganchiri stutulonarinchiri ||chinta ledika|| chukka ganugoni jnanulento makkuvato na prabhuni kanugona chakkaga betleha puramuna jochchiri kanukalichchiri ||chinta ledika|| kan'ya garbhamunandu puttenu karunagala raksakudu kristudu dhan'yulagutaku randi vegame dinulai sarva man'yulai ||chinta ledika|| papamellanu pariharimpanu parama raksakudavatarinchenu dapu jerina varikidu gudu bhagyamu moksa bhagyamu ||chinta ledika||