అడగక మునుపే

Adagaka Munupe

Hosanna Ministries 09 Jun 2026

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు అడిగిన వాటికింటే అత్యధికముగా చేయుచున్నావు యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని? నాకు సహాయము చేయుటకై – నీ దక్షిణ హస్తము చాపితివే సత్య సాక్షిగా నేనుండుటకై – ఉపకరములెన్నో చేసితివే హల్లెలూయ – ఉపకరములెన్నో చేసితివే ||అడగక|| నాకు దీర్గాయువునిచ్చుటకే – నీ హితోపదేశము పంపితివే నిత్యజీవము నేపొందుటకు – పునరుత్థానము నొందితివే హల్లెలూయ – పునరుత్థానము నొందితివే ||అడగక|| నాకు ఐశ్వర్యమునిచ్చుటకే – నీ మహిమైశ్వర్యము విడిచితివే మహిమలో నీతో నేనుండుటకే – మహిమాత్మతో నన్ను నింపితివే హల్లెలూయ – మహిమాత్మతో నన్ను నింపితివే ||అడగక||


adagaka munupe na akkaralanniyu erigina vadavu adigina vatikinte atyadhikamuga cheyuchunnavu yesayya ni krpa pondutaku nalo emunnadani? naku sahayamu cheyutakai - ni daksina hastamu chapitive satya saksiga nenundutakai - upakaramulenno chesitive halleluya - upakaramulenno chesitive ||adagaka|| naku dirgayuvunichchutake - ni hitopadesamu pampitive nityajivamu nepondutaku - punarut'thanamu nonditive halleluya - punarut'thanamu nonditive ||adagaka|| naku aisvaryamunichchutake - ni mahimaisvaryamu vidichitive mahimalo nito nenundutake - mahimatmato nannu nimpitive halleluya - mahimatmato nannu nimpitive ||adagaka||