అదిగదిగో పరలోకము
Adigadigo Paralokamu
అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము - వరుణి వలే పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది || 2 || అల్ఫా ఒమేగ యైన నా ప్రాణ ప్రియునికి నిలువెళ్ల నివేదించి మైమరతునే || 2 || నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో ప్రవేశింతునే - పరిపూర్ణమైన పరిశుద్ధులతో || 2 || || అదిగదిగో || కల్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు తలపోయుచూ నే పరవసింతునే || 2 || రాజాధిరాజు తో స్వప్నాల సౌధములో విహరింతునే- నిర్మలమైన వస్త్రధారినై || 2 || || అదిగదిగో || జయించిన వాడై సర్వాధి కారియై సింహాసనా సీనుడై నను చేర్చుకొనును || 2 || సీయోను రాజుతో రాత్రిలేని రాజ్యములో ఆరాధింతునే - వేవేల దూతల పరివారముతో || 2 || || అదిగదిగో ||
adigadigo paralokamu nundi digi vachche vadhuvu sanghamu - varuni vale paripurna saundaryamunu dharinchukunnadi || 2 || alpha omega yaina na prana priyuniki niluvella nivedinchi maimaratune || 2 || na yesu rajuto layamu kani rajyamulo pravesintune - paripurnamaina parisud'dhulato || 2 || || adigadigo || kalyana ragalu atmiya ksemalu talapoyuchu ne paravasintune || 2 || rajadhiraju to svapnala saudhamulo viharintune- nirmalamaina vastradharinai || 2 || || adigadigo || jayinchina vadai sarvadhi kariyai sinhasana sinudai nanu cherchukonunu || 2 || siyonu rajuto ratrileni rajyamulo aradhintune - vevela dutala parivaramuto || 2 || || adigadigo ||