అవధులే లేనిది
Avadhule Lenidi
అవధులే లేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది || 2 || యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది || 2 || ||అవధులే|| ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు || 2 || భారమెక్కువైనా తీరం కడుదూరమైనా నీపై ఆనుకొందును నేను గమ్యం చేరుకొందును || 2 || ||అవధులే|| సరిపోల్చలేని మధురమైన అనుభవం వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు || 2 || సౌందర్యమైన అతిపరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును నేను నీ కోసమే వేచియుందును || 2 || ||అవధులే|| లెక్కించలేని అగ్ని శోధనలో ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు || 2 || వాడబారని కిరీటము నే పొందుటకు వెనుకున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగెద || 2 || ||అవధులే||
avadhule lenidi divyamaina ni krpa anantamainadi ascharyamainadi || 2 || yesayya napai nivu chupina krpa amulyamainadi varninchalenidi || 2 || ||avadhule|| uhinchaleni hrdayanandamunu duhkhamunaku pratiga dayachesinavu || 2 || bharamekkuvaina tiram kaduduramaina nipai anukondunu nenu gamyam cherukondunu || 2 || ||avadhule|| saripolchaleni madhuramaina anubhavam vintaina ni premalo anubhavimpajesavu || 2 || saundaryamaina atiparisud'dhamaina ni rupamu talachukondunu nenu ni kosame vechiyundunu || 2 || ||avadhule|| lekkinchaleni agni sodhanalo prayasamunaku tagina phalamulichchinavu || 2 || vadabarani kiritamu ne pondutaku venukunnavi marachi nenu laksyamu vaipu sageda || 2 || ||avadhule||