ఆశ్రయదుర్గము నీవని
Asrayadurgamu Nivani
ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని || 2 || నా దాగుచోటు నీవేనని నా సమస్తమును నీవేనని || 2 || నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక నీ వెలుగుతో కప్పినావు - నీ తేజస్సుతో నింపినావు మరణాంధకారములో బంధించబడిన నీ జనులను మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు ||ఆశ్రయ|| నీ ప్రభావ మహిమాలను నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు - నాఆత్మకు తృప్తినిచ్చావు కరువు కోరాలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు ఆకాశవాకిళ్లు తెరచి సమృద్థిగానే సంపదలిచ్చావు ||ఆశ్రయ|| నా విశ్వాస ఓడను బద్దలుకానివ్వక నీ చేతితో నిలిపినావు - నీ కౌగిలిలో దాచినావు ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను జ్ఞాప్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు ||ఆశ్రయ||
asrayadurgamu nivani raksana srngamu nivenani || 2 || na daguchotu nivenani na samastamunu nivenani || 2 || na margamulannintilo chikati alumukonanivvaka ni veluguto kappinavu - ni tejas'suto nimpinavu maranandhakaramulo bandhinchabadina ni janulanu mahimanu prasarimpajesi snehitulugane maluchukonnavu ||asraya|| ni prabhava mahimalanu nityamu prakatinchaga ni atmato nimpinavu - na'atmaku trptinichchavu karuvu koralalo naluguchu vunna ni prajalaku akasavakillu terachi samrdthigane sampadalichchavu ||asraya|| na visvasa odanu baddalukanivvaka ni chetito nilipinavu - ni kaugililo dachinavu pramadapu anchulalo ugisaladu ni priyulanu jnaptiki techchukoni sajivulugane dariki cherchavu ||asraya||