ఇంతగ నన్ను
Intaga Nannu
ఇంతగ నన్ను - ప్రేమించినది నీ రూపమునాలో - రూపించుటకా || 2 || ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా శ్రమలలో సిలువలో - నీ రూపు నలిగినదా || 2 || శిలనైనా నన్ను - నీవలె మార్చుటకా శిల్ప కారుడా - నా యేసయ్యా మలుచు చుంటివా - నీ పోలికగా || ఇదియే || తీగలు సడలి - అపస్వరములమయమై మూగబోయనే - నా స్వర మండలము || 2 || అమరజీవ - స్వరకల్పనలు నా అణువణువునా - పలికించితివా || ఇదియే ||
intaga nannu - preminchinadi ni rupamunalo - rupinchutaka || 2 || idiye - nayeda nikunna nitya sankalpama sramalalo siluvalo - ni rupu naliginada || 2 || silanaina nannu - nivale marchutaka silpa karuda - na yesayya maluchu chuntiva - ni polikaga || idiye || tigalu sadali - apasvaramulamayamai mugaboyane - na svara mandalamu || 2 || amarajiva - svarakalpanalu na anuvanuvuna - palikinchitiva || idiye ||