ఎన్నెన్నో మేళ్లను

Ennenno Mellanu

Hosanna Ministries 09 Jun 2026

ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నను || 2 || || ఎన్నెన్నో|| స్వార్థ ప్రియులు కాన రానీ వెయ్యేళ్ళ పాలనలో స్వస్థ బుద్ధి గల వారే పరిపాలించే రాజ్యమది || 2 || స్థాపించునే అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును చిత్త శుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది || 2 || || ఎన్నెన్నో || భూనివాసులందరి లో గొర్రె పిల్ల రక్తము తో కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యమది || 2 || క్రీస్తు యేసు మూల రాయి యై అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్చబడుతూ వృద్ధినొందుచు సాగెదము || 2 || || ఎన్నెన్నో||


ennenno mellanu anubhavinchina nenu emani ennani vivarinchagalanu yuga yugalalo ennenno anubhavinchina nenu a pauratvamu korake poraduchunnanu || 2 || || ennenno|| svartha priyulu kana rani veyyella palanalo svastha bud'dhi gala vare paripalinche rajyamadi || 2 || sthapinchune ati tvaralo na yesu a rajyamunu chitta sud'dhi galavare paripalinche rajyamadi || 2 || || ennenno || bhunivasulandari lo gorre pilla raktamu to konabadina varunna parisud'dhula rajyamadi || 2 || kristu yesu mula rayi yai amulyamaina rallamai ayanapai amarchabadutu vrd'dhinonduchu sagedamu || 2 || || ennenno||