కృపా క్షేమము నీ శాశ్వత జీవము

Krupaa Kshemamu Nee Shaashwatha Jeevamu

Hosanna Ministries 06 Dec 2025

కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు || 2 || మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి || 2 || అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను || 2 || నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే || 2 || ఆరాధన నీకే ||కృపా క్షేమము|| నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి || 2 || కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను || 2 || ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే || 2 || ఆరాధన నీకే ||కృపా క్షేమము|| నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిలపరచితిని || 2 || బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా || 2 || ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే || 2 || ఆరాధన నీకే ||కృపా క్షేమము||


krpa ksemamu ni sasvata jivamu na jivita kalamantayu nivu dayacheyuvadavu || 2 || mahonnatamaina ni upakaramulu talanchuchu anuksanamu paravasinchana ni krpalone paravasinchana na prati prardhanaku nivichchina ivule lekkaku minchina divenalainayi || 2 || adugulu tadabadaka nadipinadi ni divya vakyame kadalini minchina visvasamunichchi vijayamu chekurchenu || 2 || ni vakyame makarandhamai balaparichenu nannu na yesayya stutipatruda aradhana nike || 2 || aradhana nike ||krpa ksemamu|| ni satya margamulo phalinchina anubhavame parimalimpachesi saksiga nilipayi || 2 || kalatachendaka nilipinadi ni divya darsaname gamyamu chere saktito nanu nimpi nutana krpanichchenu || 2 || aradhyuda abhisiktuda aradhana nike na yesayya stutipatruda aradhana nike || 2 || aradhana nike ||krpa ksemamu|| na prana priyuda nannelu maharaja na hrdi ni koraku padilaparachitini || 2 || burasabdamu vinaga na bratukulo kalalu pandaga avadhululeni anandamuto ni kaugili ne cherana || 2 || aradhyuda abhisiktuda aradhana nike pranesvara na yesayya aradhana nike || 2 || aradhana nike ||krpa ksemamu||