కృపగల దేవా దయగల రాజా

Krupagala Deva Dayagala Raja

Hosanna Ministries 28 Oct 2025

కృపగల దేవా దయగల రాజా కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహు ఘనతేగా నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని || 2 || సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా || 2 || ||కృపగల|| త్రోవను చూపే తారవు నీవే గమ్యము చేర్చే సారథి నీవే || 2 || జీవన యాత్రా శుభప్రదమాయే నా ప్రతి ప్రార్థన పరిమళమాయె నీ ఉదయకాంతిలో నను నడుపుము నా హృదిని నీ శాంతితో నింపుము || 2 || ||కృపగల|| కృప చూపి నన్ను అభిషేకించి వాగ్ధానములు నెరవేర్చినావే || 2 || బహు వింతగా నను ప్రేమించినావే బలమైన జనముగా నను మార్చినావే నీ కీర్తి జగమంత వివరింతును నీ దివ్య మహిమలను ప్రకటింతును || 2 || ||కృపగల|| నా యేసురాజా వరుడైన దేవా మేఘాల మీద దిగి వచ్చు వేళ || 2 || ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో ప్రియమైన సంఘమై నిను చేరెదను నిలిచెదను నీతోనే సీయోనులో జీవింతు నీలోనే యుగయుగములు || 2 || ||కృపగల||


krpagala deva dayagala raja krpagala deva dayagala raja cheriti ninne bahu ghanatega ni charanamule ne koritini ni varamulane ne veditini || 2 || sarvadhikari nive deva - na sahakari nive prabhuva na korikale saphalamu chesi - alochanale neraverchitivi arpinchedanu na sarvamunu nike deva aradhinchi anandincheda nilo deva || 2 || ||krpagala|| trovanu chupe taravu nive gamyamu cherche sarathi nive || 2 || jivana yatra subhapradamaye na prati prarthana parimalamaye ni udayakantilo nanu nadupumu na hrdini ni santito nimpumu || 2 || ||krpagala|| krpa chupi nannu abhisekinchi vagdhanamulu neraverchinave || 2 || bahu vintaga nanu preminchinave balamaina janamuga nanu marchinave ni kirti jagamanta vivarintunu ni divya mahimalanu prakatintunu || 2 || ||krpagala|| na yesuraja varudaina deva meghala mida digi vachchu vela || 2 || akasa vidhilo kamaniya kantilo priyamaina sanghamai ninu cheredanu nilichedanu nitone siyonulo jivintu nilone yugayugamulu || 2 || ||krpagala||