కృప కృప నా యేసు కృపా
Krupa Krupa Na Yesu Krupa
కృప కృప నా యేసు కృపా కృప కృప కృపా || 2 || నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే నేనేమైయుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై – పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా || 2 || ||కృప|| నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై – నన్నాకర్షించావయ్యా నువ్వులేని నన్ను ఊహించలేను – నా శిరస్సు నీవయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్యా నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో|| నా పాపము నను తరుమంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచితనమే కలిగించె నాలో – మారు మనస్సేసయ్యా నేనెంతగానో క్షమియించబడితిని – ఎక్కువగా ప్రేమించితివయ్యా నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో|| పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా ఏముంది నాలో నీవింతగా నను – హెచ్చించుటకు యేసయ్యా ఏమివ్వగలను నీ గొప్ప కృపకై – విరిగిన నా మనస్సేనయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో|| పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా నీలోన నేను నాలోన నీవు – ఏకాత్మ అయితిమయ్యా జీవించువాడను ఇక నేను కాను – నా యందు నీవయ్యా నీ మనసే నా దర్శనమేసయ్యా నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
krpa krpa na yesu krpa krpa krpa krpa || 2 || ni koraku nannu mundugane nirnayinchitive nivu nannu pilichi ni nitinichchi mahimaparachitive nenemaiyuntino anduku kadayya na kriyalanu batti asale kadayya chupavu prema napai - pilichavu nannu krpakai janamulaku pravaktaga nanu niyaminchavayya na talli garbhamunande pratistinchavayya || 2 || ||krpa|| napai nuvvu chupina prema ento goppadayya kalalonaina ninnu maruvanelenayya ruchi chuchi eriga ninnu na yesayya ni krpa na jivamukante uttamamainadayya ni prema dhvajame paiketti napai - nannakarsinchavayya nuvvuleni nannu uhinchalenu - na siras'su nivayya na gurtimpanta nive yesayya na pranam sarvam nive yesayya ||nenemaiyuntino|| na papamu nanu tarumanga nilo dachitive ne niku siksa vidhinchanu salom antive na nerapu maranapu siksanu nivu bharinchitive ikapai papamu cheyakani margamu chupitive ni manchitaname kaliginche nalo - maru manas'sesayya nenentagano ksamiyinchabaditini - ekkuvaga preminchitivayya na modati prema nive yesayya na modati sthanamu nike yesayya ||nenemaiyuntino|| pairupamu laksyamu chese narudavu kadayya na hrdayapu lotunu erigina devudu nivayya nanu nive korukoni na sthiti marchavayya ni prajalanu nadipimpa abhisekinchavayya emundi nalo nivintaga nanu - hechchinchutaku yesayya emivvagalanu ni goppa krpakai - virigina na manas'senayya ni korake nenu jivistanayya mana premanu kathaga vivaristanayya ||nenemaiyuntino|| padivela mandilo nivu ati sundarudavayya ati kanksaniyudavu na priyudavu nivayya nikante nanu preminche premikudevarayya vidanadani snehituda na manchi yesayya nilona nenu nalona nivu - ekatma ayitimayya jivinchuvadanu ika nenu kanu - na yandu nivayya ni manase na darsanamesayya ni mate na manugada yesayya ||nenemaiyuntino||