నీవే కృపాధారము
Nive Krupaadharamu
నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా || 2 || నూతన బలమును నవనూతన కృపను || 2 || నేటివరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకెనయ్యా ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయ పురమైన నీలో నేను || 2 || ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి || 2 || ఆపదలెన్నో అలుముకున్ననూ అభయము నిచ్చితివి ఆవేదనల అగ్ని జ్వాలలో అండగ నిలిచితివి ఆలోచనవై ఆశ్రయ మిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా - ఈ స్తోత్ర గీతం నీకెనయ్యా || 2 || || నీవే || సర్వకృపానిధి సీయోను పురవాసి - నీ స్వాస్థ్యముకై నను పిలిచితివి || 2 || సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చుదును సహనము కలిగి || 2 || శిథిలము కానీ సంపదలెన్నో నాకై దాచితివి సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వ శక్తిగల దేవుడవై నడిపించుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకెనయ్యా || 2 || || నీవే || ప్రాకారములను దాటించితివి ప్రార్ధన వినెడి పావన మూర్తివి || 2 || పరిశుద్ధులతో నను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి || 2 || పావన మైన జీవన యాత్రలో విజయము నిచ్చితివి పరమ రాజ్యములో నిలుపుట కొరకు అభిషేకించితివి పావనుడా నా అడుగులు జాడక స్థిర పరచినావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్ర గీతం నీకెనయ్యా || 2 || || నీవే ||
nive krpadharamu triyeka deva nive ksemadharamu na yesayya || 2 || nutana balamunu navanutana krpanu || 2 || netivaraku dayacheyuchunnavu ninne aradhintunu parisud'dhuda i stotra gitamu nikenayya anandinchitini anuraga bandhala asraya puramaina nilo nenu || 2 || akarsinchitivi akasamu kante unnatamaina ni premanu chupi || 2 || apadalenno alumukunnanu abhayamu nichchitivi avedanala agni jvalalo andaga nilichitivi alochanavai asraya michchi kapaduchunnavu nike i prema gitam ankitamayya - i stotra gitam nikenayya || 2 || || nive || sarvakrpanidhi siyonu puravasi - ni svasthyamukai nanu pilichitivi || 2 || siluvanu moyuchu ni chittamunu neraverchudunu sahanamu kaligi || 2 || sithilamu kani sampadalenno nakai dachitivi sahasamaina goppa karyamulu nakai chesitivi sarva saktigala devudavai nadipinchuchunnavu ninne aradhintunu parisud'dhuda i stotra gitamu nikenayya || 2 || || nive || prakaramulanu datinchitivi prardhana vinedi pavana murtivi || 2 || parisud'dhulato nanu nilipitivi ni karyamulanu nutana parachi || 2 || pavana maina jivana yatralo vijayamu nichchitivi parama rajyamulo niluputa koraku abhisekinchitivi pavanuda na adugulu jadaka sthira parachinavu ninne aradhintunu parisud'dhuda - i stotra gitam nikenayya || 2 || || nive ||