ఎడబాయని నీ కృప
Edabayani Ni Krupaa
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ || 2 || యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం || 2 || ||ఎడబాయని|| శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో – నిరాశ నిసృహలో || 2 || అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా || 2 || కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి || 2 || ||ఎడబాయని|| విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో || 2 || దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా || 2 || దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి || 2 || ||ఎడబాయని|| నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని || 2 || భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా || 2 || ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి || 2 || ||ఎడబాయని||
edabayani ni krpa nanu viduvadu ennatiki || 2 || yesayya ni premanuragam nanu kayunu anuksanam || 2 || ||edabayani|| sokapu loyalalo - kastala kadagandlalo kadaleni kadalilo - nirasa nisrhalo || 2 || ardhamekani i jivitam ika vyarthamani nenanukonaga || 2 || krpa kanikaramugala deva na kastala kadalini datinchitivi || 2 || ||edabayani|| visvasa poratamulo - eduraye sodhanalu lokasala alajadilo - sadaliti visvasamulo || 2 || dustula ksemamune chuchi ika niti vyarthamani anukonaga || 2 || dirghasantamugala deva na cheyi viduvaka nadipinchitivi || 2 || ||edabayani|| ni sevalo eduraina - enno samasyalalo na balamunu chuchukoni - nirasa chenditini || 2 || bharamaina i sevanu ika cheyalenani anukonaga || 2 || pradhana yajakuda yesu ni anubhavalato balaparichitivi || 2 || ||edabayani||