నీ కృప చాలునయా

Ni Krupaa Calunaya

28 Oct 2025

నీ కృప చాలునయా యేసయ్యా నా యేసయ్యా నీ మేలునే కోరితి మెస్సయ్యా నను కాయువాడా స్తుతి ఘనత మహిమ నిరతము నీకే చెల్లును నన్నెంతగానో ప్రేమించి నీవు నీ చేతిలో నను చెక్కుకుంటివి నా సహవాసం నీతో నుండను నీ రూపులో నను చేసుకొంటివి ఇంతటి భాగ్యము పొందుటకు ఎంతటి వాడను నేను ప్రభు ||నీ కృప|| పడియున్న నన్ను చెడనియ్యకా నీ జీవము నాలో నుంచినావు పరిశుద్ధ రక్తం నాకై కార్చి నీ దివ్య రక్షణ నిచ్చినావు నన్నాదరించిన నజరేయుడా నిన్నేన్నడు నేను మరువనయ ||నీ కృప|| నలిగిన హృదయం విరిగిన మనసుతో నీ నామ గానం చేసెద (యేసయ్య) నీ మధుర స్వరం ప్రతి దినం నే వినుచు ఆస్వాదించెద చాలునయా నాకీ జీవితం నీ సేవకే అది అంకితం ||నీ కృప||


ni krpa chalunaya yesayya na yesayya ni melune koriti mes'sayya nanu kayuvada stuti ghanata mahima niratamu nike chellunu nannentagano preminchi nivu ni chetilo nanu chekkukuntivi na sahavasam nito nundanu ni rupulo nanu chesukontivi intati bhagyamu pondutaku entati vadanu nenu prabhu ||ni krpa|| padiyunna nannu chedaniyyaka ni jivamu nalo nunchinavu parisud'dha raktam nakai karchi ni divya raksana nichchinavu nannadarinchina najareyuda ninnennadu nenu maruvanaya ||ni krpa|| naligina hrdayam virigina manasuto ni nama ganam cheseda (yesayya) ni madhura svaram prati dinam ne vinuchu asvadincheda chalunaya naki jivitam ni sevake adi ankitam ||ni krpa||