మరువలేను – మరువలేను
Maruvalenu - Maruvalenu
మరువలేను – మరువలేను – మరువలేనయ్యా || 2 || నీ ప్రేమ చరితం.. ఆ ఘోర మరణం || 2 || మరువలేనయ్యా.. మరువలేనయ్యా… యేసయ్యా.. యేసయ్యా – యేసయ్యా.. దయామయా || 2 || ఓ ఓ ఓ…. మరువలేనయ్యా.. మరువలేనయ్యా… బలి పశువుగ నా పాపము కొరకై బలియై పోతివయ్యా || 2 || నోరు తెరువక భారపు సిలువను భరియించి ఓర్చితివా నాకై భారము మోసితివా ||యేసయ్యా|| పంచ గాయములలో కారుచున్న రుధిరం నిను ముంచి వేసెనయ్యా || 2 || దోష రహితుడా హేతువు లేక నిను ద్వేషించిరయ్యా పగబట్టి చంపిరయ్యా ||యేసయ్యా|| ఏ దారి గానక – తిరిగిన నన్ను నీ దరి చేర్చితివే || 2 || మార్గము నీవై సత్యము నీవై జీవము నీవైతివే నా సర్వము నీవైతివే ||యేసయ్యా||
maruvalenu - maruvalenu - maruvalenayya || 2 || ni prema charitam.. a ghora maranam || 2 || maruvalenayya.. maruvalenayya... yesayya.. yesayya - yesayya.. dayamaya || 2 || o o o.... maruvalenayya.. maruvalenayya... bali pasuvuga na papamu korakai baliyai potivayya || 2 || noru teruvaka bharapu siluvanu bhariyinchi orchitiva nakai bharamu mositiva ||yesayya|| pancha gayamulalo karuchunna rudhiram ninu munchi vesenayya || 2 || dosa rahituda hetuvu leka ninu dvesinchirayya pagabatti champirayya ||yesayya|| e dari ganaka - tirigina nannu ni dari cherchitive || 2 || margamu nivai satyamu nivai jivamu nivaitive na sarvamu nivaitive ||yesayya||