ప్రేమ జగతికి మూలం

Prema Jagatiki Mulam

11 Jan 2026

ప్రేమ జగతికి మూలం ప్రేమ దైవ స్వరూపం ప్రేమ నిత్య జీవం ఆ ప్రేమ మోక్ష మార్గం || 2 || || ప్రేమ జగతికి || అమర్యాదగా నడువనిది అవకారం చేయనిది అన్నిటిని ఓర్చునది అన్నిటికి తాలునది స్వప్రయోజనము చూడుకొనిది సత్యరూపమే కోపపడనిది మత్తర పడనిది డంభములేనిది ఉపాంగమిది ప్రేమ ఒక్కటే || ప్రేమ జగతికి || దేవుడు మనుజుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు పాపుల రక్షణ పరమార్థముగా సిలువ మరణమై బలియైనాడు మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి ప్రేమను మించిన పెన్నిధి లేదని జగమంతా చాటించాలి || ప్రేమ జగతికి ||


prema jagatiki mulam prema daiva svarupam prema nitya jivam a prema moksa margam || 2 || || prema jagatiki || amaryadaga naduvanidi avakaram cheyanidi annitini orchunadi annitiki talunadi svaprayojanamu chudukonidi satyarupame kopapadanidi mattara padanidi dambhamulenidi upangamidi prema okkate || prema jagatiki || devudu manujula preminchi tane manisiga puttadu papula raksana paramarthamuga siluva maranamai baliyainadu manalo manamu okarikokaramu prema kaligi jivinchali premanu minchina pennidhi ledani jagamanta chatinchali || prema jagatiki ||