పరలోకమే నా స్వాస్థ్యము

Paralokame Na Svasthyamu

12 Jun 2026

పరలోకమే నా స్వాస్థ్యము ఎపుడు గాంతునో || 2 || నా ప్రియ యేసుని నేనెపుడు గాంతునో || 2 || ||పరలోకమే|| ఆకలిదప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట || 2 || పరమ మకుటము పొందను ప్రభు పాదముల చేరెదను || 2 || ||పరలోకమే|| సిలువ వేయబడితిని ఇక నేకాదు జీవించుట || 2 || ప్రభు యేసు మహిమ కొరకు గురి గలిగి జీవింతును || 2 || ||పరలోకమే|| నా పరుగు తుద ముట్టింప నాకు కృపను మెండుగ నొసగును || 2 || విశ్వాస మార్గములో విసుగక పరుగెత్తెదను || 2 || ||పరలోకమే|| పరమ విశ్రాంతి పొంద పరలోకమందు చేరెదను || 2 || పగలు రాత్రచ్చట లేదు ప్రభువే దీపమై యుండును || 2 || ||పరలోకమే|| ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను || 2 || దినములు సమీపించగా వాంఛయు అధికంబాయె || 2 || ||పరలోకమే||


paralokame na svasthyamu epudu gantuno || 2 || na priya yesuni nenepudu gantuno || 2 || ||paralokame|| akalidappulu duhkhamu manovedana ledachchata || 2 || parama makutamu pondanu prabhu padamula cheredanu || 2 || ||paralokame|| siluva veyabaditini ika nekadu jivinchuta || 2 || prabhu yesu mahima koraku guri galigi jivintunu || 2 || ||paralokame|| na parugu tuda muttimpa naku krpanu menduga nosagunu || 2 || visvasa margamulo visugaka parugettedanu || 2 || ||paralokame|| parama visranti ponda paralokamandu cheredanu || 2 || pagalu ratrachchata ledu prabhuve dipamai yundunu || 2 || ||paralokame|| priyuni pilupunu vini nenu kuda sid'dhapadedanu || 2 || dinamulu samipinchaga vanchhayu adhikambaye || 2 || ||paralokame||