దైవ తనయా క్రీస్తు నాథుండా అయ్యా
Daiva Tanaya Kristu Nathunda Ayya
దైవ తనయా క్రీస్తు నాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిను పంపినాడా ||దైవ|| పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా || 2 || ప్రాణదానము చేసినావా – దేవా పరలోకము తెరచినావా ||దేవుడే|| కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ము || 2 || కడిగి పావన పరచినావా – దేవా కడుగు బూరతో రానై యున్నావా ||దేవుడే|| మరణము జయించినావా మరణముల్లు విరచినావా || 2 || మహిమతోడ లేచినావా – దేవా మాదు చింతలు దీర్చినావా ||దేవుడే|| ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి || 2 || ధరణికే ఏతెంచినావా – దేవా ధన్యులనుగా జేసినావా ||దేవుడే|| ఆదియంతము లేనివాడా అందరికిని దేవుడవు || 2 || అల్ఫయు ఓమేగయు నీవేగా – యేసు ఆర్భటించుచు రానై యున్నావా ||దేవుడే||
daiva tanaya kristu nathunda ayya papulakai pranamichchitiva devude ninu pampinada ||daiva|| papulakai vachchinava papulanu karuninchinava || 2 || pranadanamu chesinava - deva paralokamu terachinava ||devude|| kalvarilo karchinatti divyaraktamuche mam'mu || 2 || kadigi pavana parachinava - deva kadugu burato ranai yunnava ||devude|| maranamu jayinchinava maranamullu virachinava || 2 || mahimatoda lechinava - deva madu chintalu dirchinava ||devude|| dharanilo ati dustulamuga dari teliyaka duramaitimi || 2 || dharanike etenchinava - deva dhan'yulanuga jesinava ||devude|| adiyantamu lenivada andarikini devudavu || 2 || alphayu omegayu nivega - yesu arbhatinchuchu ranai yunnava ||devude||