రాకడనే రైలు బండి వస్తున్నది

Rakadane Railu Bandi Vastunnadi

12 Jun 2026

రాకడనే రైలు బండి వస్తున్నది రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది || 2 || పరిశుద్ధులకందులో చోటున్నది || 2 || మంచి చోటున్నది – భలే చోటున్నది చక్కని సీటున్నది ||రాకడనే|| సత్యమనే చక్రములు దానికున్నవి శాంతి అనెడి పైకప్పు దానికున్నది || 2 || పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది ||రాకడనే|| ప్రతి దినము బైబిలును పఠియించుము ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము – ప్రభుకి వివరించుము ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్ సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి జయము పొందుము – పవిత్రుడవు కమ్ము ||రాకడనే|| తండ్రి కుమారాత్మలనే రైలు బండిది ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి || 2 || పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు – బండికి గార్డు ఉన్నాడు సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము – నీవు ప్రవేశించుము ||రాకడనే|| రక్షణనే టిక్కెట్టు దానికున్నది || 2 || మారు మారుమనస్సు పొంది మీరు ముందుకు రండి – టిక్కెట్టు కొనండి || 2 || ||రాకడనే|| పాపులున్న స్టేషనులో బండి ఆగదు || 2 || పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును – రైలు బండి ఆగును || 2 || ||రాకడనే||


rakadane railu bandi vastunnadi rendava rakadane railu bandi vastunnadi || 2 || parisud'dhulakandulo chotunnadi || 2 || manchi chotunnadi - bhale chotunnadi chakkani situnnadi ||rakadane|| satyamane chakramulu danikunnavi santi anedi paikappu danikunnadi || 2 || papamulanu ksamiyinche brekulunnavi - bandiki brekulunnavi jivamunaku margamani kuyuchunnadi - kuta kuyuchunnadi ||rakadane|| prati dinamu baibilunu pathiyinchumu prardananedi vijnapana vivarinchumu - prabhuki vivarinchumu eduru viche galulanedi vyadhi badhalan satanu chikkulanu yesu raktamandu kadigi jayamu pondumu - pavitrudavu kam'mu ||rakadane|| tandri kumaratmalane railu bandidi injanu draivaru peru yehovandi || 2 || parisud'dha atma anedi gardu unnadu - bandiki gardu unnadu siluva jenda etti chupi bandi nilupumu - nivu pravesinchumu ||rakadane|| raksanane tikkettu danikunnadi || 2 || maru marumanas'su pondi miru munduku randi - tikkettu konandi || 2 || ||rakadane|| papulunna stesanulo bandi agadu || 2 || parisud'dhula stesanulo bandi agunu - railu bandi agunu || 2 || ||rakadane||