రండి ఉత్సాహించి పాడుదము

Randi Utsahinchi Padudamu

12 Jun 2026

రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే || 2 || రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము || 2 || సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి|| మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్యము గల రాజు || 2 || భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే ||రండి|| సముద్రము సృష్టించెనాయనదే సత్యుని హస్తమే భువిజేసెన్ || 2 || ఆయన దైవము పాలితుల ఆయన మేపెడి గొర్రెలము ||రండి|| ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము || 2 || ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును ||రండి|| తండ్రి కుమార శుద్దాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు గాక || 2 || ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను ఆమెన్ ||రండి||


randi utsahinchi padudamu raksana durgamu mana prabhuve || 2 || randi krtajnata stotramuto raraju sannidhikegudamu || 2 || satprabhu namamu kirtanalan santosa ganamu cheyudamu ||randi|| mana prabhuve maha devundu ghana mahatyamu gala raju || 2 || bhumyagadhapu loyalunu bhudhara sikharamulayanave ||randi|| samudramu srstinchenayanade satyuni hastame bhuvijesen || 2 || ayana daivamu palitula ayana mepedi gorrelamu ||randi|| a prabhu sannidhi mokarinchi ayana mundara mrokkudamu || 2 || ayana matalu gaikonina ayyavi manakento melagunu ||randi|| tandri kumara suddatmakunu tagu stuti mahimalu kalgu gaka || 2 || adini ippudu ellappudu ayinatlu yugamulanaunu amen ||randi||