ఆరని ప్రేమ ఇది

Arani Prema Idi

Amshumathi Mary 29 Mar 2026

ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది || 2 || అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది || 2 || కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది || 2 || ||ఆరని|| సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది || 2 || ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది || 2 || కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది || 2 || ||ఆరని|| నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది || 2 || నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది || 2 || ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది || 2 || ||ఆరని|| భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన || 2 || ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు || 2 || ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది || 2 || ||ఆరని||


arani prema idi - arpajalani jvala idi || 2 || ati srestamainadi - antame lenidi avadhule lenidi - aksayamaina prema idi || 2 || kaluvari prema idi - kristu kaluvari prema idi || 2 || ||arani|| sinhasanamu nundi - siluvaku digi vachchinadi balamainadi maranamu kanna - mrtini gelchi lechinadi || 2 || idi sajivamainadi - ide satyamainadi ide nityamainadi - kristu yesu prema idi || 2 || kaluvari prema idi - kristu kaluvari prema idi || 2 || ||arani|| na sthanamandu nilichi - na siksane bhariyinchi kraya dhanamunu chellinchi - goppa raksana nichchinadi || 2 || naku viluva nichchinadi - nannu veliginchinadi a unnata rajyamandu - naku sthanamichchinadi || 2 || unnata prema idi - atyunnata prema idi || 2 || ||arani|| bhu rajulu adhipatulu - rajyalu adhikaralu cherayaina khadgamaina - karuvaina eduraina || 2 || evaru arpalenidi - evaru apalenidi pravahinchuchunnadi - prati papi chentaku || 2 || prema pravahamidi - yesu prema pravahamidi || 2 || ||arani||