సిలువ చెంత చేరిననాడు

Siluva Centa Cerinanadu

09 Dec 2025

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయున్ పౌలువలెను సీలవలెను సిద్ధపడిన భక్తులజూచి కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన పిలచుచుండే పరము చేర ||సిలువ|| వంద గొర్రెల మందలోనుండి ఒకటి తప్పి ఒంటరియాయే తొంబది తొమ్మిది గొర్రెల విడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ|| తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రియతని జేర్చుకొనియే ||సిలువ|| పాపి రావా పాపము విడచి పరిశుద్ధుల విందుల జేర పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి యంతము ||సిలువ||


siluva chenta cherinanadu kalusamulanu kadigiveyun pauluvalenu silavalenu sid'dhapadina bhaktulajuchi kondalanti bandalanti mondi hrdayambu mandinchu pandiyunna papulanaina pilachuchunde paramu chera ||siluva|| vanda gorrela mandalonundi okati tappi ontariyaye tombadi tom'midi gorrela vidichi ontariyaina gorrenu vedaken ||siluva|| tappipoyina kumarundu tandrini vidachi taralipoye tappu telisi tirigiraga tandriyatani jerchukoniye ||siluva|| papi rava papamu vidachi parisud'dhula vindula jera papula gatini parikinchitiva patalambe vari yantamu ||siluva||