సమీపించరాని తేజస్సులో నీవు

Samipincarani Tejassulo Nivu

17 Dec 2025

సమీపించరాని తేజస్సులో నీవు వసియించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింప తరమా || 2 || యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది || 2 || ||సమీపించరాని|| ధరయందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే || 2 || ఖలునకు కరుణను నొసగితివి || 2 || ||యేసయ్యా|| మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది || 2 || తులువకు విలువను ఇచ్చినది || 2 || ||యేసయ్యా||


samipincharani tejas'sulo nivu vasiyinchu vadavaina ma samipamunaku digi vachchinavu ni prema varnimpa tarama || 2 || yesayya ni prementa balamainadi yesayya ni krpa enta viluvainadi || 2 || ||samipincharani|| dharayandu nenunda cherayandu padiyunda karamandu dachitive nanne paramuna cherchitive || 2 || khalunaku karunanu nosagitivi || 2 || ||yesayya|| miti leni ni prema gati leni nanu chuchi na sthiti marchinadi nanne srutiga chesinadi || 2 || tuluvaku viluvanu ichchinadi || 2 || ||yesayya||