దేవస్తోత్రగానముల్ పై
Devastotraganamul Pai
దేవస్తోత్రగానముల్ పై - దివ్య స్థలములో దేవమారుగానముల్ భూ - దేశ స్థలములో దేవలోక పావనులును - దీన నరులును బోవజూడ భువిదివి క్రిస్మస్ అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో పవ్వళించి యున్నదేవ - బాల యేసులో ఇవ్విధముగ సఫలమాయె - ఈ దినంబున నవ్వు మోము - నరుని కబ్బెను || దేవస్తోత్రగానముల్ || షేము దేవ వందనంబు - చెప్పబడియెను భూమి స్తుతుల నందు కొనెడి - పూజనీయుడు భూమి పైన నరుడుగాను = బుట్టవచ్చెను భూమి క్రిస్మస్ - భోగమొందెను || దేవస్తోత్రగానముల్ || అందరి వంశంబులు నీ - యందు దీవెన బొందునంచు నబ్రామునకు - నందెను వాక్కు అందె క్రీస్తు – యూదులకును అన్యజనులకున్ విందు క్రిస్మస్ - విశ్వమంతటన్ || దేవస్తోత్రగానముల్ || షీలోహువచ్చు వరకు యూ - దాలో నిలుచుచు నేలు రాజదండముండు నెపుడు తొలగదు నేల మీద నిత్యశాంతి పాలన జేయ - పాలకుండౌ బాలుడు జన్మించెన్ || దేవస్తోత్రగానముల్ || అక్షయమగు చుక్క యొకటి - యాకోబులో లక్షణముగ బుట్ట - వలయును ధాత్రి పై రక్షణార్ధులే స దాని - రీక్షించెడు నక్షత్రంబగు రక్షకుడుదయించె || దేవస్తోత్రగానముల్ || పుట్టవలయు మోషే వంటి - పూర్ణ ప్రవక్త ఎట్టి వారలైన నెరుగ - నట్టి ధర్మముల్ దిట్టముగను స్థాపింప - దేవ పుత్రుడు - పుట్టెన్ గొప్ప - బోధకుడయెను || దేవస్తోత్రగానముల్ || మరియ పుత్ర నామ - మిమ్మానుయేలగున్ నరులకు దేవుండె తోడు - నిరతము వరకున్ దరిని దేవుడుండు గాన – వెరువ మెన్నడున్ పరమ దేవుని సహ - వాసము లభించెన్ || దేవస్తోత్రగానముల్ || మన నిమిత్తమైన శిశువు - మహిని బుట్టెను చనువుగ దరిజేర శిశువు -స్వామి యాయెను తనువు రక్షణను గణింప – వెనుక దీయడు వియన భూషణులకు - వేళ వచ్చెను || దేవస్తోత్రగానముల్ || మొలకలెత్త వలె యెష్షయి - మొద్దునందున ఫలము లేని మోడు నరుల - వంశవృక్షము విలువ గలుగు నిత్యజీవ – ఫలవమె లిడుటకై కళగల జన్మార్ధ - కరుడు వచ్చెను || దేవస్తోత్రగానముల్ || ఖలలు చీకటిన్ నడుచుచు - వెలుగు చూచిరి పలు విధంబులైన యట్టి - పాప చీకటుల్ తొలగజేసి శుద్ధ కాంతి - కలుగ చేయను వెలుగుగా దేవుడు వెలసె - ధాత్రిలో || దేవస్తోత్రగానముల్ || అల్పమైన బెత్లెహేము - నందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ - నిజ చరిత్రను అల్పులందు సైతమల్ప - మైన యూళ్ళలో సల్ప రక్ష - స్థాపకుడై వచ్చె || దేవస్తోత్రగానముల్ || ఆడి తప్పనట్టి దేవ - అనంత స్తోత్రముల్ నాడు పల్కు వాగ్ధా -నముల నన్నిన్ నేు నెరవేర్చినావు - నీ సుతునంపి – కీడుల్ బాపు - క్రిస్మసు గల్గె || దేవస్తోత్రగానముల్ || నీ నిజ వాగ్ధత్తములను - నిత్యము నమ్మి వాని నెరవేర్పులు విని - వట్టివి యనక మానసమున ననుభవించు – మనసునీయుమని దానామూల్య - జ్ఞాన మొసగుమీ || దేవస్తోత్రగానముల్ || గగన మందు క్రిస్మసుండు - గాన కీర్తుల జగతి యందు క్రిస్మసుండు - స్థవము గల్గుత యుగయుగముల వరకు త్త్రైకు -డొందు ప్రణుతులు సొగసుగ బరగెడు - చోద్య గీతముల్ || దేవస్తోత్రగానముల్ ||
devastotraganamul pai - divya sthalamulo devamaruganamul bhu - desa sthalamulo devaloka pavanulunu - dina narulunu bovajuda bhuvidivi krismas avvakichchinatti vakku - adigo tottilo pavvalinchi yunnadeva - bala yesulo ivvidhamuga saphalamaye - i dinambuna navvu momu - naruni kabbenu || devastotraganamul || semu deva vandanambu - cheppabadiyenu bhumi stutula nandu konedi - pujaniyudu bhumi paina naruduganu = buttavachchenu bhumi krismas - bhogamondenu || devastotraganamul || andari vansambulu ni - yandu divena bondunanchu nabramunaku - nandenu vakku ande kristu - yudulakunu an'yajanulakun vindu krismas - visvamantatan || devastotraganamul || silohuvachchu varaku yu - dalo niluchuchu nelu rajadandamundu nepudu tolagadu nela mida nityasanti palana jeya - palakundau baludu janminchen || devastotraganamul || aksayamagu chukka yokati - yakobulo laksanamuga butta - valayunu dhatri pai raksanardhule sa dani - riksinchedu naksatrambagu raksakududayinche || devastotraganamul || puttavalayu mose vanti - purna pravakta etti varalaina neruga - natti dharmamul dittamuganu sthapimpa - deva putrudu - putten goppa - bodhakudayenu || devastotraganamul || mariya putra nama - mim'manuyelagun narulaku devunde todu - niratamu varakun darini devudundu gana - veruva mennadun parama devuni saha - vasamu labhinchen || devastotraganamul || mana nimittamaina sisuvu - mahini buttenu chanuvuga darijera sisuvu -svami yayenu tanuvu raksananu ganimpa - venuka diyadu viyana bhusanulaku - vela vachchenu || devastotraganamul || molakaletta vale yessayi - moddunanduna phalamu leni modu narula - vansavrksamu viluva galugu nityajiva - phalavame lidutakai kalagala janmardha - karudu vachchenu || devastotraganamul || khalalu chikatin naduchuchu - velugu chuchiri palu vidhambulaina yatti - papa chikatul tolagajesi sud'dha kanti - kaluga cheyanu veluguga devudu velase - dhatrilo || devastotraganamul || alpamaina betlehemu - nanduna kristu nilpavalenu tanadu janma - nija charitranu alpulandu saitamalpa - maina yullalo salpa raksa - sthapakudai vachche || devastotraganamul || adi tappanatti deva - ananta stotramul nadu palku vagdha -namula nannin neu neraverchinavu - ni sutunampi - kidul bapu - krismasu galge || devastotraganamul || ni nija vagdhattamulanu - nityamu nam'mi vani neraverpulu vini - vattivi yanaka manasamuna nanubhavinchu - manasuniyumani danamulya - jnana mosagumi || devastotraganamul || gagana mandu krismasundu - gana kirtula jagati yandu krismasundu - sthavamu galguta yugayugamula varaku ttraiku -dondu pranutulu sogasuga baragedu - chodya gitamul || devastotraganamul ||