సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు
Siluvapai Vreladu Sriyesudu
సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిర దారలే ఈ జగతిని విమోచించు జీవధారలు నిరపరాధి మౌనభుని దీనుడాయెను మాతృమూర్తి వేదననే ఓదార్చెను అపవాది అహంకార మణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ|| కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను లోక మంత చీకటి ఆవరించెను శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||సిలువ||
siluvapai vreladu sriyesudu narulakai vilapinchu najareyudu a devudu chindinchina rudhira darale i jagatini vimochinchu jivadharalu niraparadhi maunabhuni dinudayenu matrmurti vedanane odarchenu apavadi ahankara manachi vesenu pagavari korakai prabhu prardhinchenu ||siluva|| kaluvari giri kannillato karigipoyenu papa jagati punadule kadalipoyenu loka manta chikati avarinchenu sriyesudu talavalchi kannumusenu ||siluva||