శాశ్వతమైన ప్రేమతో
Sasvatamaina Premato
శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా నీ ప్రేమే నను గెల్చెను విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా నీ కృపయే నను మార్చెను నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం నీ ప్రేమ తేనె కంటే మధురము నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా ప్రేమతో… ప్రేమతో… యేసయ్యా నిను వెంబడింతును ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… యేసయ్యా నిను ఆరాధింతును ||శాశ్వతమైన|| నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా దృష్టించి నిర్మించిన ప్రేమ నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే గ్రంధములో లిఖియించిన ప్రేమ నా ఎముకలను నా అవయములను వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ ప్రేమతో… ప్రేమతో… నీ కోసం సృజియించావయ్యా ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… నను మురిపెంగా లాలించావయ్యా ||శాశ్వతమైన|| నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు నను విడువక వెంటాడిన ప్రేమ నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు నా కోసం వేచిచూచిన ప్రేమ బాల్య దినముల నుండి నను సంరక్షించి కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ యవ్వన కాలమున కృపతో నను కలిసి సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ ప్రేమతో… ప్రేమతో… యేసయ్యా నను దర్శించినావయ్యా ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… నను ప్రత్యేకపరిచావేసయ్యా ||శాశ్వతమైన|| నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ తన సొత్తుగా చేసుకున్న ప్రేమ విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి నా విలువని పెంచేసిన ప్రేమ లోకమే నను గూర్చి చులకన చేసినను తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ యేసయ్యా… యేసయ్యా… నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… నను నీలా మార్చేందులకేనయ్యా ||శాశ్వతమైన|| పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు కరుణించి పైకి లేపిన ప్రేమ నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ నను చంకన ఎత్తుకున్న ప్రేమ నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ ప్రేమతో… ప్రేమతో… నను మరలా సమకూర్చావేసయ్యా ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా ||శాశ్వతమైన|| కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన నా తోడై ధైర్యపరచిన ప్రేమ చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ లోకమే మారిననూ మనుషులే మరచిననూ మరువనే మరువదుగా నా యేసు ప్రేమ తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ ప్రేమతో… ప్రేమతో… నా విశ్వాసం కాపాడవయ్యా ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… బంగారంలా మెరిపించావయ్యా ||శాశ్వతమైన|| ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని అందలమును ఎక్కించిన ప్రేమ పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ ప్రేమతో… ప్రేమతో… శాశ్వత జీవం నాకిచ్చావయ్యా ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… నను చిరకాలం ప్రేమిస్తావయ్యా ||శాశ్వతమైన||
sasvatamaina premato nanu preminchavayya ni preme nanu gelchenu viduvaka ni krpa na yeda kuripinchinavayya ni krpaye nanu marchenu ni prema unnatam - ni prema amrtam ni prema tene kante madhuramu ni prema lotulo - nanu nadupu yesayya ni premaloni ne veru pari nikai jivinchina premato... premato... yesayya ninu vembadintunu premato... premato... premato... yesayya ninu aradhintunu ||sasvatamaina|| na talli garbhamunandu ne pindamunaiyundamga drstinchi nirminchina prema na dinamulalo okataina arambhamu kakamunupe grandhamulo likhiyinchina prema na emukalanu na avayamulanu vintaga ediginchi rupinchina prema talli odilo nenu palu traguchunnappudu nam'mikanu nalona puttinchina prema tana sonta polika rupulona nanu srstinchina prema premato... premato... ni kosam srjiyinchavayya premato... premato... premato... nanu muripenga lalinchavayya ||sasvatamaina|| ne prabhuvunu erugaka yundi ajnanamuto unnappudu nanu viduvaka ventadina prema na srstikartanu gurchi smarane nalo lenappudu na kosam vechichuchina prema balya dinamula nundi nanu sanraksinchi kanti reppala nannu kapadina prema yavvana kalamuna krpato nanu kalisi satyamunu bodhinchi veliginchina prema ne vedakakunnanu naku doriki nanu bratikinchina prema premato... premato... yesayya nanu darsinchinavayya premato... premato... premato... nanu pratyekaparichavesayya ||sasvatamaina|| ne papinai yundagane nakai maraninchina prema tana sottuga chesukunna prema viluve lenatti nakai tana pranapu viluvani chellinchi na viluvani penchesina prema lokame nanu gurchi chulakana chesinanu tana drstilo nenu ghanudanna prema evaru lekunna nenu niku saripona nivu bahu priyudavani balaparachina prema na muddu bidda nuvvantu nannu tega muddadina prema yesayya... yesayya... napai inta prema entayya yesayya... yesayya... yesayya... nanu nila marchendulakenayya ||sasvatamaina|| palu marlu ne padinappudu bahu chikkulalonunnappudu karuninchi paiki lepina prema nene ninu chesanantu nene bhariyistanantu nanu chankana ettukunna prema na tappatadugulu tappakunda sari chesi tappulanu manpinchi sthiraparachina prema nannu batti maraduga nannu cheradisenuga saratule lenatti na tandri prema tanakistamaina ghanamaina patraga nanu malachina prema premato... premato... nanu marala samakurchavesayya premato... premato... premato... ni saksyanga nilabettavayya ||sasvatamaina|| kastala kolumullona kanniti loyallona na todai dhairyaparachina prema chelaregina tuphanulalo edategani poratanlo tana matato santinichchindi prema lokame marinanu manusule marachinanu maruvane maruvaduga na yesu prema tallila preminchi tandrila bodhinchi alochana cheppi vidipinchina prema ksanamatramaina nanu vidiponi vatsalyata gala prema premato... premato... na visvasam kapadavayya premato... premato... premato... bangaranla meripinchavayya ||sasvatamaina|| uhinchalenatuvanti krpalani napai kuripinchi na sthiti gati marchivesina prema na sonta saktito nenu ennadunu pondagaleni andalamunu ekkinchina prema paksi raju rekkalapai nityamu nanu mostu sikharamupai nannu nadipinchu prema parvatalapai eppudu kristu varta chatinche sundarapu padamulu nakichchina prema tana rayabariga nannu unchina yese i prema premato... premato... sasvata jivam nakichchavayya premato... premato... premato... nanu chirakalam premistavayya ||sasvatamaina||