రారాజు వస్తున్నాడో
Raraju Vastunnado
రారాజు వస్తున్నాడో జనులారా.. రాజ్యం తెస్తున్నాడో త్వరపడి వేగమే రండి ప్రియులారా.. ప్రభుని చేరగ రండి వస్తానన్న యేసు రాజు రాక మానునా తెస్తానన్న బహుమానం తేక మానునా || 2 || ||రారాజు|| పాపానికి జీతం రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన || 2 || మహిమకు యేసే మార్గము జీవము || 2 || అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము || 2 || ||వస్తానన్న|| పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు || 2 || యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం యేసయ్య గాయాలు రక్షణకు మార్గం అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము || 2 || ||వస్తానన్న|| కనురెప్ప పాటున కడబూర మ్రోగగా పరమున ఉందురు నమ్మిన వారందరు || 2 || నమ్మని వారందరు శ్రమల పాలవుతారు || 2 || అందుకే నమ్ముకో యేసయ్యను చేరుకో పరలోక రాజ్యంబును || 2 || ||వస్తానన్న||
raraju vastunnado janulara.. rajyam testunnado tvarapadi vegame randi priyulara.. prabhuni cheraga randi vastananna yesu raju raka manuna testananna bahumanam teka manuna || 2 || ||raraju|| papaniki jitam rendava maranam adi agni gundamu andulo vedana || 2 || mahimaku yese margamu jivamu || 2 || anduke nam'muko yesayyanu ponduko ni papa pariharamu || 2 || ||vastananna|| papam cheyyoddu maha sapamayyenu i papa phalitam i roga rugmatalu || 2 || yesayya gayalu svasthataku karanam yesayya gayalu raksanaku margam anduke nam'muko yesayyanu ponduko ni papa pariharamu || 2 || ||vastananna|| kanureppa patuna kadabura mrogaga paramuna unduru nam'mina varandaru || 2 || nam'mani varandaru sramala palavutaru || 2 || anduke nam'muko yesayyanu cheruko paraloka rajyambunu || 2 || ||vastananna||