నా నీతి సూర్యుడా
Na Niti Suryuda
నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని || 2 || రాజులకే రారాజువు – కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి || నా నీతి || శ్రమలలో బహు శ్రమలలో – ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే – నను వీడని అనుబంధమై || 2 || నీ మాటలే జల ధారాలై – సంతృప్తి నిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురమ్! || రాజులకే || మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు యేదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని || 2 || భీకరమైన కార్యములు చేయుచున్నవాడ సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్న వాడ ఘనపరతును నిన్నే! ప్రేమించే యేసయ్యా – నీవుంటే చాలునయ నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి || నా నీతి || సంఘమై నీ స్వాస్థ్యమై నను నీయెదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించియున్నావు నీవు || 2 || వరములతో ఫలములతో నీకై బ్రతకాలని… తుదిశ్వాశ నీసన్నిధిలో విజయం చూడాలని… ఆశతో వున్నానయ! కరుణించే యేసయ్యా – నీకోసమే నాజీవితం నినుచేరే ఆశయం తీరాలని – నిను చూసే ఆక్షణం రావాలయ్యా || నా నీతి ||
na niti suryuda - bhuvinelu yesayya saripolchalenu nito - ghanulaina varini || 2 || rajulake rarajuvu - krpachupe devudavu nadipinche najareyuda - kapade kaparivi || na niti || sramalalo bahu sramalalo - adarana kaliginchenu vakyame krpa vakyame - nanu vidani anubandhamai || 2 || ni matale jala dharalai - santrpti nichchenu ni matale ausadhamai gayamulu kattenu ni mate madhuram! || rajulake || melukai samastamunu jariginchuchunnavu nivu yediyu koduva cheyavu ninnasrayinchina varini || 2 || bhikaramaina karyamulu cheyuchunnavada sajivudavai adhikastotramu ponduchunna vada ghanaparatunu ninne! preminche yesayya - nivunte chalunaya nadipinche najareyuda - kapade kaparivi || na niti || sanghamai ni svasthyamai nanu niyeduta nilapalani atmato mahimatmato nanu mudrinchiyunnavu nivu || 2 || varamulato phalamulato nikai bratakalani... tudisvasa nisannidhilo vijayam chudalani... asato vunnanaya! karuninche yesayya - nikosame najivitam ninuchere asayam tiralani - ninu chuse aksanam ravalayya || na niti ||