పాడెద స్తుతి గానము
Padeda Stuti Ganamu
పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము ||2|| నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్టుడా నా యేసయ్య ||2|| ||పాడెద|| ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు ||2|| నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను ||2|| నీ అనుబంధము నాకు ఆనందమే ||2|| ||పాడెద|| నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధరలే నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే ||2|| నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను ||2|| నీ అభిషేకము పరమానందమే ||2|| ||పాడెద|| బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి ||2|| యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే ||2|| నీ పరిచర్యలో మహిమానందమే ||2|| ||పాడెద||
padeda stuti ganamu koniyadeda ni namamu ||2|| nive na premanuragam ksanamaina viduvani sneham ati srestuda na yesayya ||2|| ||padeda|| ila nakevaru leranukonaga na dari cheriteve ne nam'minavare nanu marachinanu maruvani devudavu ||2|| ni asale nalo chigurinchenu ni vakyame nannu bratikinchenu ||2|| ni anubandhamu naku anandame ||2|| ||padeda|| na prati anuvunu parisud'dhaparichenu ni rudira dharale ni darsaname nanu nilipinadi dharanilo ni korake ||2|| ni chetule nanu nirminchenu ni rupame nalo kaligenu ||2|| ni abhisekamu paramanandame ||2|| ||padeda|| balahinatalo nanu balaparichi dhairyamu nimpitive na karyamulu saphalamuchesi atmato nadipitivi ||2|| yuda gotrapu kodama sinhama nito nityamu vijayahasame ||2|| ni paricharyalo mahimanandame ||2|| ||padeda||