అసామానుడైన వాడు
Asamanudaina Vadu
అసామానుడైన వాడు అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును || 2 || అగ్ని గుండాములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ – తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై || 2 || శత్రువు చేతికి నిన్ను అప్పగించడు || 2 || || సియోను || పరిస్థితులన్నీ చేజారిపోయిన ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా – మారానుమధురముగా మార్చానునీకై || 2 || మేలులతో నిను తృప్తిపరచును || 2 || || సియోను || ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా – న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను || 2 || పిలిచిన దేవుడు నిను మరచిపోవునా || 2 || || సియోను ||
asamanudaina vadu avamanaparachaduninnu otami'erugani mana devudu odiponivvadu ninnu ghanakaryalenno nikai chesinavadu kastakalamandu ni cheyi vidachuna asadhyamulenno datinchina nathudu sramalo ninnu datipovuna siyonu devude ninnu siggupadanivvadu kanikara purnude ni kanniru tudachunu || 2 || agni gundamulo nettivesina sinhala notiki ninnu appaginchina setruve ni sthitichusi atiseya paduchunna sinhale ni edute mringiveya nilichina nake ela sramalantu krngipokuma - terichudu esuni agnilo nilichenu nikai || 2 || satruvu chetiki ninnu appaginchadu || 2 || || siyonu || paristhitulanni chejaripoyina entagano sremapadina phalitame lekunna anukunnavanni duramaipoyina manchirojulostayane niriksane lekunna maradi talaratani digulupadakuma - maranumadhuramuga marchanunikai || 2 || melulato ninu trptiparachunu || 2 || || siyonu || ontari poratame visugurepina pondina pilupe baramaipoyina atmiyulandaru avamanistunna nam'madaginavaruleka niraseto nilichina pilupune vidachi maralipokuma - n'yayadhipatiye nayakuniga nilupunu ninnu || 2 || pilichina devudu ninu marachipovuna || 2 || || siyonu ||