ఆశపడకు ఈ లోకం

Asapadaku I Lokam

Bro. Shalem Raju Garu 08 Dec 2025

ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా ||ఆశపడకు|| ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా దేహం కోరేదేదైనా – అది మట్టిలోనే పుట్టిందమ్మా || 2 || వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు || 2 || మట్టిలోనుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మా || 2 || ||ఆశపడకు|| అందమైన ఓ సుందర స్త్రీకి – గుణములేక ఫలమేమమ్మా పంది ముక్కున బంగారు కమ్మీ – పెట్టిన ఫలితం లేదమ్మా || 2 || అందమైన ఆ దీనా షెకెములు హద్దులేక ఏమయ్యిందమ్మా || 2 || అంతరంగమున గుణముకలిగిన శారా చరిత్రకెక్కిందమ్మా || 2 || ||ఆశపడకు|| జాతి కొరకు ఉపవాస దీక్షతో – పోరాడిన ఎస్తేరు రాణిలా నీతి కొరకు తన అత్తను విడువక – హత్తుకున్న రూతమ్మ ప్రేమలా || 2 || కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలీనలా || 2 || హన్నా వలె మన దోర్కా వలె ప్రిస్కిల్ల వోలె విశ్వాస వనితలా || 2 || వారి దీక్షయే వారసత్వమై అనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై || 2 || పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మా || 2 || ||ఆశపడకు||


asapadaku i lokam kosam chellem'ma asinchedi edaina adi mattenam'ma manisi asinchedi edaina adi mattenam'ma ||asapadaku|| asalu repe sundara deham - matti bom'ma o chellem'ma deham korededaina - adi mattilone puttindam'ma || 2 || vendi bangaru velagala vastram parimala puspa sugandhamulu || 2 || mattilonundi vachchinavenani maruvaboku na chellem'ma || 2 || ||asapadaku|| andamaina o sundara striki - gunamuleka phalamemam'ma pandi mukkuna bangaru kam'mi - pettina phalitam ledam'ma || 2 || andamaina a dina sekemulu hadduleka emayyindam'ma || 2 || antarangamuna gunamukaligina sara charitrakekkindam'ma || 2 || ||asapadaku|| jati koraku upavasa diksato - poradina esteru ranila niti koraku tana attanu viduvaka - hattukunna rutam'ma premala || 2 || kannillato prabhu kallu kadigi tana kurulato tudichina magdalinala || 2 || hanna vale mana dorka vale priskilla vole visvasa vanitala || 2 || vari diksaye varasatvamai ananta rajyapu nitya svasthyamai || 2 || pavitramaina hrdayamu kaligi prabhuvu koraku jivinchalam'ma || 2 || ||asapadaku||