జీవన తొలి సంధ్య

Jivana Toli Sandhya

Gudapati Isaac Varaprasad 22 Mar 2026

జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నా జీవన మలి సంధ్య నీతోనే అంతము || 2 || నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది || 2 || నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు || 2 || ||జీవన|| నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు || 2 || నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను || 2 || దేవా నీవే నా ఆశ్రయ దుర్గము || 2 || ||జీవన|| నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను || 2 || నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా || 2 || దేవా నను నీ సాక్షిగ నిల్పుమా || 2 || ||జీవన||


jivana toli sandhya nitone arambham na jivana mali sandhya nitone antamu || 2 || na jivana yatraku mali sandhya asannamautundi || 2 || nanu sid'dhaparachu yesu natha nitonundutaku || 2 || ||jivana|| na jivana yatralo enno avarodhalu na jivana gamananlo enno avamanalu || 2 || niriksana leni itarula poli duhkhinchanu nenu na bharamu nipai mopi munduku saguchunnanu || 2 || deva nive na asraya durgamu || 2 || ||jivana|| na purvikulandaru eppudo gatincharu edo oka rojuna na yatra muginchedanu || 2 || na sesa jivitamantayu nike arpinchitinayya na vesa bhasayulanniyu nike samarpintunu deva || 2 || deva nanu ni saksiga nilpuma || 2 || ||jivana||