అంతా నా మేలుకే
Anta Na Meluke
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ || 2 || అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను – స్తుతియించుట మానను || 2 || స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా || 2 || మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ || 2 || మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ || 2 || ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా || 2 || యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను || 2 || ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక || 2 || ||అంతా|| అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున || 2 || నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు || 2 || నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు || 2 || ||అంతా|| ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును || 2 || నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా || 2 || పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ || 2 || ||అంతా|| చదువులే రాకున్నా – ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా || 2 || నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు || 2 || నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు || 2 || ||అంతా|| సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి – మేలుకై జరుగును || 2 || యేసుని సారూప్యము – నేను పొందాలని || 2 || అనుమతించిన ఈ – విలువైన సిలువకై || 2 || ||అంతా|| నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను – తెలిసికొందును || 2 || ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే || 2 || అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే || 2 || ||అంతా||
nenellappudu yehovanu sannutinchedan nityamu ayana kirti na nota nundun || 2 || anta na meluke - aradhana yesuke anta na manchike - tana chittamunaku tala vanchite tana chittamunaku tala vanchite aradhana apanu - stutiyinchuta mananu || 2 || stutiyinchuta mananu kannille panamulaina - kathina duhkha badhalaina sthiti gatule marina - avakasam chejarina || 2 || maradu yesu prema - nityudaina tandri prema || 2 || maradu yesu prema - nityudaina tandri prema || 2 || ||anta|| astulanni kolpoyina - kannavare kanumarugaina upiri bharuvaina - gundele pagilina || 2 || yehova ichchenu - yehova tisukonenu || 2 || ayana namamunake - stuti kalugu gaka || 2 || ||anta|| avamanam entaina - na vare kadanna nivu tappa evarunnaru akasamanduna || 2 || nivu nakundaga - edi nakakkara ledu || 2 || nivu nakundaga - edi nakakkara ledu || 2 || ||anta|| asale samadhiyaina - vyadhi badha velluvaina adhikaram koppukoni - raksanakai anandintunu || 2 || nadu manas'su ni mida - anukonaga o natha || 2 || purna santi ne pondi - ninne ne kirtintun || 2 || ||anta|| chaduvule rakunna - otami palaina udyogam lekunna - bhumike bharuvaina || 2 || na yedala ni talampulu - ento priyamulu || 2 || nivuddesinchinadi - nisphalamu kaneradu || 2 || ||anta|| sankalpana pilupondi - ninne preminchu naku samastamu samakudi - melukai jarugunu || 2 || yesuni sarupyamu - nenu pondalani || 2 || anumatinchina i - viluvaina siluvakai || 2 || ||anta|| nivu cheyunadi - nakippudu teliyadu ika midata nenu - telisikondunu || 2 || prastutamu samastamu - duhkha karame || 2 || abhyasinchina niti - samadhana phalame || 2 || ||anta||