ఆనందింతు నీలో దేవా
Anandintu Nilo Deva
ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు || 2 || మధురమైన నీ నామమునే || 2 || మరువక ధ్యానించెద ప్రభువా ||ఆనందింతు|| ఆత్మ నాథా అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధారుండా || 2 || అనయము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీర || 2 || ||ఆనందింతు|| నాదు జనములు నను విడచినను నన్ను నీవు విడువకుండా || 2 || నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన || 2 || ||ఆనందింతు|| శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు మేఘమందు రానైయున్న || 2 || ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతం వరకును భద్రపరచుము || 2 || ||ఆనందింతు|| శ్రమలు నన్ను చుట్టిన వేళ చింతలో కృశించిన వేళ || 2 || అభయముగా నీ దర్శనమిచ్చి శ్రమలు బాపి శాంతినిచ్చితివి || 2 || ||ఆనందింతు||
anandintu nilo deva anudinam ninu stutinchuchu || 2 || madhuramaina ni namamune || 2 || maruvaka dhyanincheda prabhuva ||anandintu|| atma natha adrsya deva akhila charalaku adharunda || 2 || anayamu ninu madi koniyaduchune anandintu asa tira || 2 || ||anandintu|| nadu janamulu nanu vidachinanu nannu nivu viduvakunda || 2 || ni kanu drsti napai nunchi naku raksana srngamaina || 2 || ||anandintu|| sresthamagu ni svasthyamu koraku meghamandu ranaiyunna || 2 || a ghadiya eppudo evariki telusu antam varakunu bhadraparachumu || 2 || ||anandintu|| sramalu nannu chuttina vela chintalo krsinchina vela || 2 || abhayamuga ni darsanamichchi sramalu bapi santinichchitivi || 2 || ||anandintu||