గూడు లేని గువ్వనై–కూడు లేని బిడ్డనై
Gudu Leni Guvvanaikudu Leni Biddanai
గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై || 2 || నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై || 2 || దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను || 2 || అప్పుడొక మెల్లని స్వరము నాతో మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని || 2 || ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా జీవితమంత ప్రకాశింప సాగింది || 2 || ||గూడు|| అప్పుడొక తియ్యని స్వరము నాతో మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని || 2 || ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా పాప జీవితము పారిపో సాగింది || 2 || ||గూడు|| అప్పుడొక అద్భుత స్వరము నాతో మాట్లాడి చెప్పెను రాజైన యేసుని || 2 || ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి || 2 || గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై || 2 || నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై || 2 || దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను || 2 || యేసుని నమ్ముకో – యేసుని చేరుకో యేసుని కోరుకో – యేసుతో చేరిపో (4)
gudu leni guvvanai - kudu leni biddanai || 2 || nida leni manisinai - andarilo ontarinai || 2 || dari teliyani sthitilo nilabadi unnanu sahayamu koraku arjistu unnanu || 2 || appudoka mellani svaramu nato matladi cheppenu prabhuvaina yesuni || 2 || eppudaite a svaramu vinnano nenu na jivitamanta prakasimpa sagindi || 2 || ||gudu|| appudoka tiyyani svaramu nato matladi cheppenu priyudaina yesuni || 2 || eppudaite a svaramu vinnano nenu na papa jivitamu paripo sagindi || 2 || ||gudu|| appudoka adbhuta svaramu nato matladi cheppenu rajaina yesuni || 2 || eppudaite a svaramu vinnano nenu na prasnalannitiki javabulu dorikayi || 2 || gudu unna guvvanai - kudu unna biddanai || 2 || nida unna manisinai - okkarilo veyyinai || 2 || dari telisina sthitilo nilabadi unnanu sevaloni madhuryamu nanubhavistunnanu || 2 || yesuni nam'muko - yesuni cheruko yesuni koruko - yesuto cheripo (4)