విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
Vijayasiluda Na Prana Priyuda
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిను స్తుతించెదను || 2 || నా యేసయ్యా నిను వేడుకొనగా నా కార్యములన్నియు సఫలము చేసితివి || 2 || ||విజయశీలుడా|| అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – || 2 || ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు || 2 || నిత్యానందము కలిగించె నీ శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి || 2 || ||విజయశీలుడా|| ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – || 2 || అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు || 2 || నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా || 2 || ||విజయశీలుడా|| ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – || 2 || అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు || 2 || నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు || 2 || ||విజయశీలుడా||
vijayasiluda na prana priyuda krtajnatato ninu stutinchedanu || 2 || na yesayya ninu vedukonaga na karyamulanniyu saphalamu chesitivi || 2 || ||vijayasiluda|| alasina samayamuna - na pranamulo trana puttinchinavu - || 2 || adarana kaliginchi pilupunu sthiraparachi dhairyamuto nimpinavu || 2 || nityanandamu kaliginche ni subha vachanamulato - nem'madinichchitivi || 2 || ||vijayasiluda|| ascharyakaramuga - ni bahuvu chapi vidudala kaliginchinavu - || 2 || aranya margamuna viduvaka todai vijayamuto nadipinavu || 2 || ni svasthyamunaku tandriga nilichi vagdhana bhumilo - cherchina deva || 2 || ||vijayasiluda|| arogyakaramaina ni - rekkala nidalo asrayamichchitivi naku - || 2 || aksayuda na sampurnatakai mahimatmato nimpinavu || 2 || nityamu nito nenundutakai nutana yerusalemu nirminchuchunnavu || 2 || ||vijayasiluda||