కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం

Kurcundunu Ni Sannidhilo Deva Prati Dinam

Joseph Konda 14 Dec 2025

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం || 2 || నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును|| ప్రతి విషయం నీకర్పించెదా నీ చిత్తముకై నే వేచెదా || 2 || నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా || 2 || నీ నామమునే హెచ్చించెదా || 2 || నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే – నా ఆధారము నీవే యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును|| ప్రతి దినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా || 2 || నీ వాక్యానుసారము జీవించెదా || 2 || నీ ఘన కీర్తిని వివరించెదా || 2 || నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||


kurchundunu ni sannidhilo - deva prati dinam dhyanintunu ni vakyamunu - deva prati ksanam || 2 || nirantaram ni namamune ganamu chesedanu prati ksanam ni sannidhine anubhavinchedanu ||kurchundunu|| prati visayam nikarpincheda ni chittamukai ne vecheda || 2 || ni sphurtini pondi ne sageda || 2 || ni namamune hechchincheda || 2 || na atisayamu nive - na asrayamu nive na anandamu nive - na adharamu nive yesu yesu yesu yesu.. ||kurchundunu|| prati dinamu ni mukha kantito na hrdaya dipam veligincheda || 2 || ni vakyanusaramu jivincheda || 2 || ni ghana kirtini vivarincheda || 2 || na durgamu nive - na dhvajamu nive na dhairyamu nive - na darsanam nive yesu yesu yesu yesu.. ||kurchundunu||