భజియింతుము నిను జగదీశా

Bhajiyintumu Ninu Jagadisa

Addanki Ranjith Ophir 15 Feb 2026

భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా || 2 || శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి || 2 || ||భజియింతుము|| విమల సెరాపులు దూత గణంబులు చూడగ లేని తేజోనిధివే || 2 || మా యధములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే || 2 || ||శరణు|| ప్రప్రధముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి || 2 || నీ భజనలు మా జీవనాధారం చేకొనవే మా స్తుతి గీతం || 2 || ||శరణు||


bhajiyintumu ninu jagadisa sri yesa ma raksana karta || 2 || saranu saranu ma deva yehova mahimanvita chira jivanidhi || 2 || ||bhajiyintumu|| vimala serapulu duta ganambulu chudaga leni tejonidhive || 2 || ma yadhamulakai siluva mranupai dinudavai maraninchitive || 2 || ||saranu|| prapradhamuda mari kadapati vada mrtudai bratikina nirata nivasi || 2 || ni bhajanalu ma jivanadharam chekonave ma stuti gitam || 2 || ||saranu||