నా స్తుతుల పైన నివసించువాడా

Na Stutula Paina Nivasincuvada

Hossanna Ministers 15 Mar 2026

నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా || 2 || నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే || 2 || నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకే వింతైనది || 2 || ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు || 2 || ||నా స్తుతుల|| ద్రాక్షావల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములీయనా || 2 || ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే విజయుడా నీ కృప చాలును నా జీవితాన || 2 || ||నా స్తుతుల|| నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి || 2 || నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద || 2 || ||నా స్తుతుల||


na stutula paina nivasinchuvada na antarangikuda yesayya || 2 || nivu na paksamai yunnavu ganuke jayame jayame ellavelala jayame || 2 || nannu nirminchina riti talachaga ento ascharyame adi na uhake vintainadi || 2 || erupekkina satruvula chupu nundi tappinchi enaleni premanu napai kuripinchavu || 2 || ||na stutula|| draksavalli ayina nilone bahuga veru paraga nito madhuramaina phalamuliyana || 2 || unnata sthalamulapai naku sthanamichchitive vijayuda ni krpa chalunu na jivitana || 2 || ||na stutula|| nito yatra cheyu margamulu ento ramyamainavi avi nakento priyamainavi || 2 || ni mahimanu koniyadu parisud'dhulato nilichi padi tantula sitarato ninne kirtincheda || 2 || ||na stutula||