పునరుత్థానుడా విజయశీలుడా
Punarutthanuda Vijayasiluda
పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా ||2|| నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కారుణ్యశీలుడా ||2|| || పునరుత్థానుడా || కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్య శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్య ||2|| నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్య ||2|| ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా ||2|| || పునరుత్థానుడా || మోడు బారిన నా జీవితం చిగురించెనయ్య అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా ||2|| నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా ||2|| మహిమ నాథుడా నా ప్రేమపాత్రుడా ||2|| || పునరుత్థానుడా || నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదనయ్య (చేరేదనయ్య) కన్నులారా నా స్వామిని చూచెద నేనయ్య ||2|| ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్ధాత్ముడా ||2|| నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్య ||2|| || పునరుత్థానుడా ||
punarut'thanuda vijayasiluda na prananathuda ||2|| na prati avasaramu tirchinatti yesunathuda na apajayamulalo jayamunichchina karunyasiluda ||2|| || punarut'thanuda || kondalu loyalu eduraina jadiyanu yesayya sodhana vedana badhalalo ninnu viduvanu yesayya ||2|| nakunna todu nida nive nadu yesayya ||2|| premapurnuda na stutiki patruda ||2|| || punarut'thanuda || modu barina na jivitam chigurinchenayya andhakaram tolaginche vennela nivayya ||2|| na cheyi patti nannu nadipina rajuvu nivayya ||2|| mahima nathuda na premapatruda ||2|| || punarut'thanuda || nadu yatra mugiyagane ninnu cheredanayya (cheredanayya) kannulara na svamini chucheda nenayya ||2|| a mahimaku nannu pilachukunna parisud'dhatmuda ||2|| na pranam nivayya na sarvam nivayya ||2|| || punarut'thanuda ||