ప్రియ యేసు రాజును

Priya Yesu Rajunu

Zion 21 Dec 2025

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు || 2 || నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు || 2 || ||ప్రియ యేసు|| యేసుని రక్తమందు కడుగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి || 2 || నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను || 2 || బంగారు వీదులలో తిరిగెదను || 2 || ||ప్రియ యేసు|| ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ || 2 || కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి || 2 || ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ || 2 || ||ప్రియ యేసు|| హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు || 2 || హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ || 2 || వర్ణింప నా నాలుక చాలదయ్యా || 2 || ||ప్రియ యేసు|| ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో || 2 || తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో || 2 || ఆశతో వేచియుండే నా హృదయం || 2 || ||ప్రియ యేసు||


priya yesu rajunu ne chuchina chalu mahimalo nenayanato unte chalu || 2 || nityamaina moksagrhamu nandu cheri bhaktula gumpulo harsinchina chalu || 2 || ||priya yesu|| yesuni raktamandu kadugabadi vakyanche nityam bhadraparachabadi || 2 || niskalanka parisudhdulato pedan nenu || 2 || bangaru vidulalo tirigedanu || 2 || ||priya yesu|| mundla makutambaina talanu juchi svarna kiritam betti anandintun || 2 || koradato kottabadina vipun juchi || 2 || prati yokka gayamunu muddadedan || 2 || ||priya yesu|| hrdayamu stutulato nimpabadenu na bhagya grhamunu smarinchuchu || 2 || halleluya amen halleluya || 2 || varnimpa na naluka chaladayya || 2 || ||priya yesu|| aha a bura eppudu dhvaninchuno aha na asa eppudu tirutundo || 2 || tandri na kannitini tuduchuneppudo || 2 || asato vechiyunde na hrdayam || 2 || ||priya yesu||