ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా

Unnatamaina Rajyapuvasi Yesayya

15 Mar 2026

ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా ఈ ధరణికి వచ్చావా నీ జన్మ మనుజాలిపంట - సాతనుకే చితిమంట నా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా మంచివారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే మంచికార్యములు చేయు స్వభావము మాలోపల కానరాదే మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా మహిమను విడిచావా - ధరణికి వచ్చావా || ఉన్నతమైన రాజ్యపువాసీ || ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో ఎచటా కనుగొనలేమే గుణహీనుడైన మానవుని ఋణము చెల్లింపదలిచావా మహిమను విడిచావా - ధరణికి వచ్చావా || ఉన్నతమైన రాజ్యపువాసీ || పొరుగువాడు కలిగున్నదానినే ఆశించుటయే తప్ప ఇరుగుపొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే పురుగువంటి నరమాత్రునికి కరుణతో సర్వమిచ్చావా మహిమను విడిచావా - ధరణికి వచ్చావా || ఉన్నతమైన రాజ్యపువాసీ ||


unnatamaina rajyapuvasi yesayya a mahimanu vidichava ennikaleni papini nakai yesayya i dharaniki vachchava ni janma manujalipanta - satanuke chitimanta na jivitamanta ni premagiti padukunta manchivarine preminchuta makilalo sadhyamu kade manchikaryamulu cheyu svabhavamu malopala kanarade manchitanamannade leni vanchakuni karuninchava mahimanu vidichava - dharaniki vachchava || unnatamaina rajyapuvasi || pranapradamuga preminchina tana mitruni korakaina pranamu nichchedu varini ilalo echata kanugonaleme gunahinudaina manavuni rnamu chellimpadalichava mahimanu vidichava - dharaniki vachchava || unnatamaina rajyapuvasi || poruguvadu kaligunnadanine asinchutaye tappa iruguporugulaku akkaralo sahayamu cheyagaleme puruguvanti naramatruniki karunato sarvamichchava mahimanu vidichava - dharaniki vachchava || unnatamaina rajyapuvasi ||